వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.!
జనం వాయిస్ దినపత్రిక:
రాజన్న జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారు జాము నుండే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి.కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని, ఆలయాల్లో కార్తిక దీపాలను వెలిగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ‘ఓం నమఃశివాయా’ పంచాక్షరీ మంత్రంతో మారుమ్రోగు తున్నాయి. ఆది దేవుడినీ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.వేములవాడ, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, నల్లగొండ ఛాయా సోమేశ్వర ఆలయం, చెర్వుగట్టుతోపాటు హైదరాబాద్‌లోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెల కొన్నది కార్తిక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.కార్తీక సోమవారం వత్రం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి.. కుటుంబంలో సుఖ సంతో షాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని.. వివాహం కానీ స్త్రీలకు మంచి భర్త వస్తారని.. వివామైన వాళ్లకు మాంగల్య బలం పెరుగుతుందని నమ్మకం.