వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.!
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.! జనం వాయిస్ దినపత్రిక: రాజన్న జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారు జాము నుండే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి.కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని, ఆలయాల్లో కార్తిక దీపాలను వెలిగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ‘ఓం నమఃశివాయా’ పంచాక్షరీ మంత్రంతో మారుమ్రోగు...