janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 12:55 pm Digital Edition : JANAM VOICE

శాసనసభ దగ్గర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేలకు గాయాలు.

శాసనసభ దగ్గర ఉద్రిక్తత.. ఎమ్మెల్యేలకు గాయాలు.

జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 07:

సోమవారం  ఉదయం అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ ఎస్  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. బ్లాక్ టీషర్ట్స్ తో వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. సభలోకి పంపాలంటూ హరీష్ రావు టీషర్ట్ తీసేసారు. ఈ నేపధ్యంలో పోలీసులతో బీఆర్ఎస్  ఎమ్మెల్యేల మద్య  వాగ్వాదం జరిగింది. తోపులాటలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి కింద పడిపోయారు. ఎమ్మల్యే సబితా ఇంద్రారెడ్డిని మెడపట్టి నెట్టేసారు. తన చీర లాగేశారని సునీత లక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు. తోపులాటలో కేటీఆర్, జగదీష్ రెడ్డికి గాయాలు అయ్యాయి. కేటీఆర్ ముఖం, చేతికి గాయాలు అయ్యాయి. తరువాత పోలీసులు బీఆర్ఎస్  ఎమ్మెల్యేలను పీఎస్ కు తరలించారు.