janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 2:03 pm Digital Edition : JANAM VOICE

శీలం రాజ్ కుమార్ మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదు.-కొత్త శ్రీనివాస్.

శీలం రాజ్ కుమార్ మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదు.
– మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్.

జనం వాయిస్,మంథని,అక్టోబర్29:

శీలం రాజేశ్వరి-దేవేందర్ ల కుమారుడు రాజ్ కుమార్ మృతితో నాకు ఎలాంటి సంబంధం లేదని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరo మంథని లోని శ్రీపాదకాలనీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శ్రీపాదకాలనీకి చెందిన హమాలి సోదరులకు రాజ్ కుమార్ కు మధ్య పాత కక్షలతో గొడవ పెట్టుకొని ఒకరి పై ఒకరు దాడులు చేసుకొని ఒకరి పై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారని, దీనితో కొంత మంది పై కేసు కూడ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అయితే రాజ్ కుమార్ ఆత్మ హత్య ప్రయత్నం చేయడంతో గత సంవత్సరo పాటు చికిత్స పొంది గత నెలలో మృతి చెందటం జరిగిందని పేర్కొన్నారు.హమాలిలకు రాజ్ కుమార్ కు మధ్య జరిగిన గొడవ విషయంలో నేను ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదని తెలిపారు.రాజ్ కుమార్ మృతి తర్వాత నాకు గిట్టని కొంత మంది ప్రోద్బలంతో నాపై ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు.రాజ్ కుమార్ మృతి తో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రజలకు తెలిపారు. చట్టంపై, పోలీసులపై నాకు గౌరవం ఉందని, రాజ్ కుమార్ మృతి సంఘటనపై పూర్తి విచారణ జరుపాలని కోరుతున్నట్లు తెలిపాడు.