సమయానికి అందని పెన్షన్లు..రిటైర్డ్ ఉద్యోగుల తీవ్ర అవస్థలు!
సమయానికి అందని పెన్షన్లు..రిటైర్డ్ ఉద్యోగుల తీవ్ర అవస్థలు!1వ తేదీన జీతాలిచ్చినట్లే మాకూ పెన్షన్లు ఇవ్వాలి: పెన్షనర్ల జేఏసీ డిమాండ్.జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 16:సమయానికి పెన్షన్ అందక ప్రభుత్వ పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడు పెన్షన్ చేతికొస్తుందోనని రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 20 నుంచి 30 ఏళ్ల పాటు ప్రభుత్వంలో సేవలందించిన తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం, రోజువారీ ఖర్చులకు డబ్బుల్లేక, అవసరాలు తీర్చుకుందామన్న అప్పుపుట్టని...