సింగరేణి అధికారుల నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలి.
జనం వాయిస్, గోదావరిఖని:
సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో కార్మికుల ప్రాణాలు పోతున్నాయని, రక్షణ పై 11 ఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని మేనేజ్మెంట్ చెప్పుకుంటుందని దానిని మాత్రం ఆచరణలో పెడుతలేరని ఆరోపించారు. నిత్యం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ, చిత్రహింసలకు యాజమాన్యం పాల్పడుతుందన్నారు.
రక్షణను గాలికి వదిలేసి కార్మికులను అధికారులు వేధిస్తున్నారన్నారు. ఉత్పత్తి అంటే రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని తీయాలనేటువంటి అంశాన్ని అధికారులు మర్చిపోయారన్నారు. నీరు, పని స్థలాల్లో గాలి ఉండటం లేదన్నారు. యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని రక్షణ చర్యలను గాలికి వదిలేస్తున్నారన్నారు. సరైన గాలి అందుకు పని స్థలాల్లో కార్మికుల కళ్ళు తిరిగి పడిపోతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులే ఉంటే ఉత్పత్తి ఎలా సాధ్యమైతుందని ప్రశ్నించారు. మేనేజ్మెంట్ కార్మికులను మంచి వాతావరణంలో పనిచేయించాల్సింది పోయి, ఇన్ఫార్మర్లను పెట్టుకొని ఒక్కొక్కరికి పనిలో వేధిస్తున్నారని మండిపడ్డారు. గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ యాజమాన్యం పక్షాన చేరి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పాత దొరల పోకడను అధికారులు కార్మికుల మీద చూపిస్తున్నారన్నారు. అధికారులు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసుకుని ఉంటున్నారని, అలాంటి వారిని వెంటనే ట్రాన్స్ఫర్లు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగిన టీబీజీకే నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యాన్ని నాయకులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి చెల్పూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు పోలాడి శ్రీనివాసరావు, చల్ల రవీందర్ రెడ్డి, బ్రాంచ్, ఫిట్ సెక్రటరీలు వాసర్ల జోసెఫ్, పల్లె సురేందర్, రెహమాన్, మీస రాజు, పులిపాక శంకర్, రాసమల్ల సందీప్, ఎండి సలీం, తోట తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.