సింగరేణి అధికారుల నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలి.
సింగరేణి అధికారుల నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలి.జనం వాయిస్, గోదావరిఖని:సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతో కార్మికుల ప్రాణాలు పోతున్నాయని, రక్షణ పై 11 ఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని మేనేజ్మెంట్ చెప్పుకుంటుందని దానిని మాత్రం ఆచరణలో పెడుతలేరని ఆరోపించారు. నిత్యం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ, చిత్రహింసలకు యాజమాన్యం పాల్పడుతుందన్నారు.రక్షణను గాలికి వదిలేసి...