janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 3:42 pm Digital Edition : JANAM VOICE

సినీ నటికి వేధింపులు.

సినీ నటికి వేధింపులు.

క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు.

జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 15:

సినిమా అవకాశాల పేరుతో ఓ నటిని వేధించడమే కాకుండా, రావాల్సిన పారితోషికం ఇవ్వకుండా మోసం చేసిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ’ఆకాశంలో ఒక తార’ సినిమాలో నటింపజేసినందుకు గానూ సదరు నటికి ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం, రూ.38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా నిందితుడు కాలయాపన చేశాడు. ఈ క్రమంలోనే గత ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌కు పిలిపించి, బకాయిలు ఇవ్వకుండా బెదిరించడమే కాకుండా.. బలవంతంగా కారులో ఎక్కించుకుని మరిన్ని అవకాశాలు ఇస్తానంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా, ఆమె నిందితుడిని ఫోన్ లో నిలదీసింది. అయితే ఆమెను సైతం నిందితుడు దుర్భాషలాడి బెదిరించడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.