స్మృతి మంధన పెళ్లి..
జనం వాయిస్ సినిమా:
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధన పెళ్లి కన్ఫర్మ్ అయింది. ఆమె చేసుకోబోయే వరుడు మ్యూజిక్ డైరెక్టర్ పాలాష్ ముచ్ఛల్ ఈ విషయాన్ని నిర్ధారించాడు. దీంతో క్రికెట్ అభిమానులు, సినిమా లవర్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. స్టేట్ ప్రెస్ క్లబ్ ఈవెంట్‌లో వీరి రిలేషన్స్ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు స్వీట్‌గా సమాధానమిచ్చాడు. ఆమె త్వరలో ఇండోర్ డాటర్ ఇన్ లా కాబోతుందని.. ఇది మాత్రం చెప్పగలను అన్నాడు. మీకో హెడ్ లైన్ ఇచ్చా కదా అంటూ స్మైల్ ఇచ్చాడు. ఇది ఐసిసి మహిళల వోడి వరల్డ్ కప్ మ్యాచ్ ముందు హోల్కర్ స్టేడియంలో పర్ఫెక్ట్ మైక్-డ్రాప్ మూమెంట్ కాగా త్వరలో అఫిషియల్ వెడ్డింగ్ డేట్ రానుందని తెలుస్తోంది.
ఈ న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా మంధన అభిమానులు కొందరు శుభాకాంక్షలు చెప్తుంటే.. ఆమెను ఆరాధిస్తున్న వారు డిజప్పాయింట్ అవుతున్నారు. కాగా 2019 నుంచే వీరిద్దరి మధ్య క్లోజ్నెస్ ఉందని తెలుస్తోంది. కొన్ని నెలలుగా వీరిద్దరి ఈవెంట్స్, ట్రావెల్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.