హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
జనం వాయిస్ దినపత్రిక, జగిత్యాల:
జగిత్యాల: హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
జగిత్యాల పట్టణంలో తోట శేఖర్ హత్య కేసులో నిందితుడు సామండ్ల మహేశ్‌కు న్యాయమూర్తి రత్న పద్మావతి జీవిత ఖైదుతో పాటు రూ. 5000 జరిమానా విధించారు. బీట్ బజార్‌కు చెందిన మహేశ్, హనుమాన్ వాడకు చెందిన తోట శేఖర్ మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో, 2023 అక్టోబర్ 16న మహేశ్ కత్తితో పొడిచి శేఖర్‌ను హత్య చేశాడు.