janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 June 2026, 4:38 pm Digital Edition : JANAM VOICE

పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.

పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.

– జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద.

జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 25:

పెద్దపల్లి జిల్లాలో 2026 పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి జూన్ 12 వరకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో మొత్తం 172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, అందులో 160 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని,  ఉత్తీర్ణులైన విద్యార్థుల ద్వారా జిల్లాలో ఉత్తీర్ణత శాతం 93.02 శాతంగా నమోదైందని, ఈ ఫలితాలను సాధించడంలో కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు, విషయ  బోధన ఉపాధ్యాయులకు,జిల్లా విద్యాశాఖ అధికారి  అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.