janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 12:45 am Digital Edition : JANAM VOICE

నవీన్ యాదవ్‌ కి బీఫామ్ అందజేసిన టిపిసిసి చీఫ్

నవీన్ యాదవ్‌ కి బీఫామ్ అందజేసిన టిపిసిసి చీఫ్

జనం వాయిస్,తెలంగాణ:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ఆదివారం కాంగ్రెస్ పార్టీ బీఫామ్అందజేశారు.ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్ యాదవ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.అటు పార్టీ పరంగా రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జి మంత్రులు, పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీలు పార్టీ శ్రేణుల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఆయనకు పార్టీ బీఫామ్ అందజేసింది. జూబ్లీహిల్స్‌లో ఈనెల 21 వరకూ నామినేషన్లు, నామినేషన్ల పరిశీలన ఈనెల 22, ఉప సంహారణ 24న, పోలీంగ్ తేదీ నవంబర్11న జరుగునున్నది. నవంబర్14న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.