janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 7:10 pm Digital Edition : JANAM VOICE

14వ అంతస్తు బిల్డింగ్ పై నుండి దూకి ఐటీ ఉద్యోగి మృతి.

14వ అంతస్తు బిల్డింగ్ పై నుండి దూకి ఐటీ ఉద్యోగి మృతి.

జనం వాయిస్ దినపత్రిక :

హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.. తాను ఉంటున్న నివాసం 14 అంతస్తు బిల్డింగ్ పై నుంచి దూకి ఇంజనీర్ మరణించాడు.. ఈ విషాద ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాసరావు హుజూర్‌నగర్ వాసి. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులోని స్థిరపడ్డాడు. స్థానికంగా నల్లగండ్లలో ఉన్న రాంకీ గెలాక్సీయా అపార్ట్మెంట్స్ లోని 14 అంతస్తులో ఆయన నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యతో తరచూ శ్రీనివాస్ రావు కి గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దమనుషులు వచ్చి ఇరువురికి నచ్చచెప్పి పంచాయితీ చేసినా ఫలితం లేదు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నిరంతరం ఆస్తి విషయంలో గొడవలు అవుతూనే ఉండేవి. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ 14 ఫ్లోర్ నుండి శ్రీనివాసరావు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే శ్రీనివాసరావు మృతి చెందాడు.