janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:43 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ ఆచార్య జయ శంకర్‌ 15వ, వర్ధంతి వేడుకలు.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ ఆచార్య జయ శంకర్‌ 15వ, వర్ధంతి వేడుకలు.

– ఘన నివాళ్లుఅర్పించిన.
– సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు.

జనం వాయిస్, జూన్ 21,(హుస్నాబాద్):

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య
ప్రొఫెసర్‌ జయశంకర్‌ 15 వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ గ్రాడ్యుయేట్ ఏమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా… జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అర్పించిన గొప్పవ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని అన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. జయశంకర్‌ ఆశయాలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయన్నారు.
తెలంగాణ ఉద్యమానికి స్వరాష్ట్ర సాధనకు జయశంకర్‌ జీవితాన్ని అంకితం చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితకాలం సాధన చేశారని కొని యాడారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో వివిధ రంగాల మేధావులను, ఉద్యోగ,వ్యాపారులను, విద్యార్థులను ఒక్క తాటిపైకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈకార్యక్రమంలో మహిళా సంక్షేమ సంఘం జిల్లా నాయకురాలు చిట్యాల భాగ్యలక్ష్మి, జెరిపోతుల పద్మ, తైదల రాజేశ్వరి, రేణుక, పీ.మాధవి, అక్షర, ఏస్ రమేష్,సంపత్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.