దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు. ప్రజలు, మండపాల నిర్వాహకులు సహకరించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పిలుపు. జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 20: దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించనున్న విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా ప్రజలు, ఉత్సవ కమిటీల నిర్వాహకులు సహకరించాలని కోరారు. గోదావరి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన...