లంచం కేసులో పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.
లంచం కేసులో పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు. రూ.75 వేల లంచం కేసులో గతంలో అరెస్ట్. ఆదాయానికి మించిన ఆస్తులపై తాజాగా తనిఖీలు. జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 16: మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన అధికారులు, అత్తాపూర్లోని ఆమె నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు....