రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు తప్పవు!
రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు తప్పవు! వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు. రైతులు కల్లాలు, సొంత స్థలాల్లోనే ధాన్యం ఆరబెట్టాలి. ముత్తారం ఎస్ఐ ఎన్. రవికుమార్ హెచ్చరిక. జనం వాయిస్, ముత్తారం, నవంబర్ 06:రోడ్లపై ధాన్యం ఆరబోస్తూ వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముత్తారం ఎస్ఐ ఎన్. రవికుమార్ హెచ్చరించారు. రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాల టైర్లు జారి ప్రమాదాలు జరిగే అవకాశముందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురయ్యే ముప్పు ఉందని పేర్కొన్నారు....