చీకటిపై వెలుగుల విజయం.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక దీపావళి!
చీకటిపై వెలుగుల విజయం.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక దీపావళి! ఆధ్యాత్మికత, ఆనందం, ఐక్యతను చాటే దీపాల పండుగ.. లక్ష్మీపూజతో పాటు కేదారేశ్వర వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత.. సంప్రదాయ ఆచారాలతో పండుగ నిర్వహణ.. పర్యావరణహిత దీపావళే లక్ష్యం. జనం వాయిస్ ప్రత్యేక కథనం:భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దీపావళి పండుగకు విశిష్టమైన స్థానం ఉంది. చీకటిని పారద్రోలి వెలుగులను నింపే ఈ పండుగ కేవలం దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుకునే వేడుక మాత్రమే కాదు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన ఆధిపత్యానికి,...