ప్రజాకవి కాళోజీ.. ప్రజల గొంతుకగా నిలిచిన అక్షర యోధుడు!

ప్రజాకవి కాళోజీ.. ప్రజల గొంతుకగా నిలిచిన అక్షర యోధుడు!అన్యాయంపై అక్షర పోరాటం.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక నిర్భయంగా ప్రశ్నించిన కలం.. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన జీవితం జనం వాయిస్, ప్రత్యేక కథనం: తెలుగు సాహిత్య చరిత్రలో ప్రజల పక్షాన నిలబడి, సమాజంలోని అన్యాయాలు, అక్రమాలు, అసమానతలపై తన కలంతో పోరాడిన మహోన్నత వ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. కవిత్వాన్ని కేవలం భావ వ్యక్తీకరణకే పరిమితం చేయకుండా, ప్రజల సమస్యలను ప్రశ్నించే ఆయుధంగా మలిచిన అరుదైన సాహితీవేత్త ఆయన. తెలంగాణ నేలపై పుట్టి, తెలంగాణ ప్రజల జీవితాలను...