వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుభాకాంక్షలు.
జూపూడి నర్సింగరావును కలిసి అభినందించిన రామగుండం ఎమ్మెల్యే.
జనం వాయిస్, రామగుండం, నవంబర్ 07:
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా జూపూడి నర్సింగరావు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆయనను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం నర్సింగరావును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. నూతన బాధ్యతలు చేపట్టిన జూపూడి నర్సింగరావు వెలమ కార్పొరేషన్ అభివృద్ధికి, సామాజిక వర్గ అభ్యున్నతికి సమర్థవంతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమాజ సంక్షేమానికి తనవంతు సేవలందించాలని కోరారు.