సెంటినరీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.
సెంటినరీ కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. నలుగురు అరెస్ట్.. రూ.18,650 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం. జనం వాయిస్, రామగిరి, నవంబర్ 11:సెంటినరీ కాలనీలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్, రామగిరి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18,650 నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటినరీ కాలనీలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో...