చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ.. తరగతి గదుల్లో బాలల సందడి!
చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ.. తరగతి గదుల్లో బాలల సందడి!వివిధ వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు.. ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన చిన్నారులుజనం వాయిస్, మందమర్రి: నవంబర్ 13 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి ఫిల్టర్ బెడ్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో సందడి చేశారు. ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి తమలోని ప్రతిభాపాటవాలను చాటుకున్నారు. ఉపాధ్యాయులుగా మారిన చిన్నారుల ఉత్సాహం, హావభావాలు, చురుకుదనం...