తెలంగాణ లో 25 వేల మంది నకిలీ ఉద్యోగులా..!!

తెలంగాణ లో 25 వేల మంది నకిలీ ఉద్యోగులా..!! జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 05: సాధారణంగా దొంగలు పడితే ఇంట్లో సామాన్లు పోతాయి, కానీ మన తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడితే ఏకంగా ‘ఉద్యోగాలే’ పుట్టుకొచ్చాయి! సినిమాల్లో చూపిస్తే లాజిక్ అడుగుతామని భయపడి డైరెక్టర్లు కూడా టచ్ చేయని ఒక అద్భుతమైన ‘సైన్స్ ఫిక్షన్’ కథ మన రాష్ట్రంలో ఇన్నేళ్లుగా నిశ్శబ్దంగా నడిచిపోతోంది.రాష్ట్రంలో సుమారు 25 వేల మంది ఉద్యోగులు ఉన్నారట. వీరు ఆఫీసులకు వస్తారు పేపర్ల మీద.. పని చేస్తారు...