3 నెలల్లో 28 మంది మృతి.
– ‘కీడు’ సోకిందని ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు.!
జనం వాయిస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వరుసగా 28 మంది వివిధ కారణాలతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగించింది. గ్రామానికి ఏదో ‘కీడు’ సోకిందని బలంగా నమ్మిన గ్రామస్థులు, పురోహితుడి సూచన మేరకు వింత నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజంతా ఊరు ఖాళీ చేసి పొలాల్లో ‘కీడు వంటలు’ వండుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి, డప్పు చాటింపు వేయించి మరీ ఊరి బయటకు వెళ్లారు. ఇలా చేస్తేనే గ్రామానికి పట్టిన పీడ విరుగడవుతుందని వారు విశ్వసిస్తున్నారు.