janamvoice.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 1:50 pm Digital Edition : JANAM VOICE

బిచ్చగాడి చేతిలో స్కానర్. క్యూ ఆర్ కోడ్ కి డబ్బులు చెల్లించండి అంటూ నయా ట్రెండ్.

బిచ్చగాడి చేతిలో స్కానర్. క్యూ ఆర్ కోడ్ కి డబ్బులు చెల్లించండి అంటూ నయా ట్రెండ్.

జనం వాయిస్, రాజన్న సిరిసిల్ల జిల్లా:

అతను ఓ బిచ్చగాడు డబ్బుల కోసం వీధి వీధి తిరుగుతూ బిక్షమెత్తుకునే బిక్షగాడు… కానీ ట్రెండ్ ఫాలో అవుతున్న నయా ట్రెండ్ బిక్షగాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటున్న బిక్షగాడు. బిచ్చగాడు బిచ్చగాడు అని పదేపదే అంటున్నా అని అనుకోకండి.. తను అడుక్కోవడానికి కూడా క్యూఆర్ కోడ్ ని వాడుతూ తన బాధను వెల్లపుచ్చుకుంటున్నాడు. సిరిసిల్ల పట్టణంలో ఓ వినూత్న సంఘటన చోటుచేసుకుంది. విరాళాల్లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ సమీపంలో ఓ బిచ్చగాడు కూటికి కోసం …తన కడుపు కోసం అడుక్కోవడానికి చిల్లరను వెతుక్కుంటూ క్యూఆర్ కోడ్ ను చేతిలో పట్టుకొని మరీ రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. అమ్మ అయ్య డబ్బులు ఇవ్వండి లేదంటే నా క్యూఆర్ కొడ్ కు స్కాన్ చేసి డబ్బులు పంపండి అని మరీ అడుక్కుంటున్నాడు. ఇటువంటి ఓ వినూత్నమైనటువంటి ఒక సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలోని నడిబొట్టిన చోటు చేసుకోవడంతో పలువురు దీనిపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.