janamvoice.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 12:14 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం.

తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం.

జనం వాయిస్, హైదరాబాద్:

బేవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ కోట్లు వసూళ్లు చేసిన అక్కల రామకృష్ణ ప్రసాద్ ను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసారు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్లో పలువురి వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకొని బురిడీ కొట్టించాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు,  నిందితుడిని అరెస్టు చేసారు. ఎల్వోసీ జారీచేసి పారిపోతుండగా సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు.
బాధితుడు నరేందర్ కు బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ కోటి 30 లక్షలు విడతల వారీగా వసూలు చేసి పరారైయాడు. తండ్రి వరప్రసాద్, మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ల్యాండ్ కొన్నానంటూ, సొంత ఫ్లాట్ అంటూ వ్యాపారులని నమ్మించి నట్టేట ముంచాడు. రామకృష్ణ పై ఆస్ట్రేలియాలో అనేక చీటింగ్ కేసులు, ఆస్ట్రేలియాలో జైలు జీవితం గడిపినట్లు సమాచారం. రామకృష్ణ చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులని ఆశ్రయించండి అంటూ ప్రకటించారు. రామకృష్ణ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వ్యాపారవేత్తలను టార్గెట్ గా చేసి కోట్లాది రూపాయలు డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూర్, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ నమ్మిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 4 కోట్లు రూపాయలు లోన్ తీసుకొని ఎగ్గొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.