25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన మిత్రుడు.
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన మిత్రుడు.- కేరళ నుంచి జగిత్యాలకు ప్రత్యేక ప్రయాణం.- గూగుల్ సాయంతో స్నేహితుడి ఇంటి గుర్తింపు.- నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఘటన.జనం వాయిస్, జగిత్యాల, జూలై 11: పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ.25 వేల అప్పును తీర్చేందుకు కేరళ నుంచి వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జగిత్యాల జిల్లాకు వచ్చిన వ్యక్తి నిజాయితీ అందరినీ ఆకట్టుకుంది. స్నేహం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.సమాచారం ప్రకారం, మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల...