తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి.

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి.- వీణవంక మండలం కొండపాకలో విషాదం. జనం వాయిస్, జమ్మికుంట: వీణవంక మండలం కొండపాక గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టు ఐలయ్య (55), వృత్తిరీత్యా గీత కార్మికుడు, తాటి చెట్టు మీదనుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతి చెందాడు. శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఐలయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు...