అమరావతి బ్రాండ్‌కు కొత్త ఊపిరి.

అమరావతి బ్రాండ్‌కు కొత్త ఊపిరి.-‘ఆవకాయ’ పేరుతో సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం.జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 22: అమరావతి బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలంగా నిలబెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పర్యాటక శాఖ ‘ఆవకాయ’ పేరుతో సరికొత్త సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ వేడుకలను జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల...