దొంగతనానికి కొత్త ప్లాన్..!

దొంగతనానికి కొత్త ప్లాన్..! ఇంట్లోనే చిక్కుకున్న మహిళ. యజమానికే బెదిరింపులు. వైరల్‌గా మారిన వీడియో. జనం వాయిస్, జైపూర్, జులై 4: దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడిన మహిళ, తాను చిక్కుకుపోయానని తెలుసుకున్న వెంటనే ఇంటి యజమానినే బెదిరించిన ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వెలుగుచూసింది. తనను బయటకు పంపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసు పెడతానంటూ హెచ్చరించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముహానా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంట్లో లేని సమయంలో...