janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 5:57 pm Digital Edition : JANAM VOICE

15 కేవీ ట్రాన్స్ ఫార్మర్ లో తలెత్తిన సమస్య.

  • 15 కేవీ ట్రాన్స్ ఫార్మర్ లో తలెత్తిన సమస్య.
  • వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన రాజాపూర్ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య.
  • జనం వాయిస్, రామగిరి, మే 20:
  • రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి 15 కేవీ ట్రాన్స్ ఫార్మర్ లో ఓవర్ లోడ్ కారణంగా సమస్య తలెత్తి కరెంట్ నిలిచిపోయింది. దీంతో వెంటనే స్పందించిన సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య డీఈ, ఏఈతో మాట్లాడి కరెంట్ ను పునరుద్ధరించారు. అంతేకాకుండా గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం కోసం నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. దీంతో బుధవారం సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు నూతన 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ మహేందర్ రెడ్డి, లైన్మెన్ రమేష్, జె.ఎల్.ఎం. అంజి. వార్డు సభ్యులు పుల్లెల సుజాత, శశికుమార్ పాల్గొన్నారు.