దొంగ సర్టిఫికెట్ల దందా..!?
దొంగ సర్టిఫికెట్ల దందా..!? మహబూబాబాద్ కబడ్డీ అసోసియేషన్‌లో అవినీతి బాగోతం. ఆర్మీ జవాన్, సీనియర్ ప్లేయర్ డబ్బులు నొక్కేసిన వైనం. ప్రతిభావంతులకు మొండిచేయి.. పైసలిస్తేనే సెలక్షన్స్? రాష్ట్ర అసోసియేషన్‌కు వినతిపత్రం సమర్పించిన జాతీయ ఆటగాడు పిట్టల వీరన్న గౌడ్. మహబూబాబాద్, సెప్టెంబర్ 23 (జనం వాయిస్): మహబూబాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌లో భారీ అక్రమాలు, నిధుల దుర్వినియోగం కలకలం రేపుతున్నాయి. క్రీడాకారుల అభివృద్ధిని గాలికొదిలేసి, అసోసియేషన్ ముసుగులో కొందరు దొంగ సర్టిఫికెట్ల దందాకు తెరలేపారని ఆర్మీ జవాన్, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు పిట్టల వీరన్న...