చేతికి రాఖీ.. గుండెల్లో బంధం.

చేతికి రాఖీ.. గుండెల్లో బంధం.ఆ ఒక్క దారం.. ఎన్నో జ్ఞాపకాలకు వారధి.జనం వాయిస్, మందమర్రి – రక్షాబంధన్ స్పెషల్ స్టోరీ | ఆగస్టు 27:‘అన్నా..’ అని చెల్లెలు పిలిచే పిలుపులోని ఆప్యాయతకు వెలకట్టలేం. ‘చెల్లీ..’ అని అన్న పలికే మాటలో దాగి ఉన్న అనురాగానికి కొలమానం లేదు. చిన్నప్పుడు ఒకరి వెంట ఒకరు తిరిగిన అన్నాచెల్లెళ్లు.. పెద్దయ్యాక ఎవరి జీవితాల్లో వారు బిజీ అయినా.. రాఖీ పండుగ వచ్చిందంటే ఆ బంధం మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్తుంది. చేతికి కట్టే రాఖీ కొన్ని రూపాయల విలువైనదే...