janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 6:08 pm Digital Edition : JANAM VOICE

రూ.1000 లంచానికి లక్ష బహుమతి..సీఎం విజయ్ సంచలన నిర్ణయం.

రూ.1000 లంచానికి లక్ష బహుమతి..సీఎం విజయ్ సంచలన నిర్ణయం.

జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 20:

తమిళనాడు ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే, మీ నుండి కేవలం రూ.1000 లంచం డిమాండ్ చేసినా.. ప్రజలు సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ.1,00,000 నగదు బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇందుకోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.