janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:18 pm Digital Edition : JANAM VOICE

తానంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.

తానంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.

– ట్రాక్టర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి.

జనం వాయిస్, మరిపెడ, మే 16:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని తానంచెర్ల గ్రామం సెంటర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు మరిపెడ వైపు నుండి సూర్యాపేట దిశగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని, గంగా భవాని రోడ్డునుండి తానంచెర్ల ప్రధాన రోడ్డుపైకి ఎక్కుతున్న ట్రాక్టర్ ఢీకొట్టినట్లు తెలిసింది. ఢీకొన్న ప్రభావంతో బైక్ రైడర్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.