సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి.
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులు
దీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్న ఇద్దరు అభ్యర్థులు
మొదటగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేత
అరగంట తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో
ప్రమాణ స్వీకారానికి బంధువులను ఆహ్వానించిన ఇద్దరు అభ్యర్థులు
అధికారులకు తలనొప్పిగా మారిన ఘటన.