మలుపులు తిరుగుతున్న  ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.

మలుపులు తిరుగుతున్న  ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు. జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 20: తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం ఒక కీలక మలుపు తిరిగింది. ఈ కేసు లోతుపాతులను వెలికి తీసేందుకు, అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలను నిగ్గుతేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని  ఏర్పాటు చేసింది.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో మార్చి 14 శనివారం రాత్రి పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీ జరుగుతోందని...