Date of Publish : 10 March 2026, 12:58 pmDigital Edition : JANAM VOICE
తెలంగాణ కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం.
తెలంగాణ కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం.
హైదరాబాద్ చేరుకున్న శివ ప్రతాప్ శుక్లా.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రి స్వాగతం.
మంత్రులు, ఉన్నతాధికారుల హాజరు.
జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 10:
తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రానికి వచ్చిన నూతన గవర్నర్‌కు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా గవర్నర్‌కు స్వాగతం తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, రాష్ట్ర పోలీసు డిజిపి బి. శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా విమానాశ్రయంలో గవర్నర్‌ను ఆహ్వానించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన గవర్నర్ రాష్ట్రానికి చేరుకోవడంతో రాజ్ భవన్‌లో అధికారిక కార్యక్రమాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.తెలంగాణకు కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. త్వరలో అధికారిక ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని సమాచారం.