ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE.
జనం వాయిస్, జనగామ జిల్లా :
జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ. 10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.వివరాల ప్రకారం దేవురుప్పుల మండలంలో వేసిన పైప్‌లైన్లకు మేజర్‌మెంట్ చేసి ఫైనల్ బిల్లు కోసం బాధితుడు డీఈఈని సంప్రదించాడు. అయితే ఆమె లంచం డిమాండ్ చేయడంతో డీఈఈ నియమించుకున్న ప్రైవేట్ సహాయకుడు మహేందర్‌కు బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.10 వేలను పంపించాడు.వెంటనే ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడి చేసి ప్రైవేట్ వ్యక్తిని, డీఈఈ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటి ఆధారంగా ఇద్దరిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న డీఈఈని వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.