ఆరుగురిని చంపిన పోక్సో కేసు నిందితుడు.
ఘటనలో కన్నబిడ్డలు, భార్య కుడా బలి.
కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి రేప్ చేసి దారుణ హత్య.
షాబాద్ లో ఘటన.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 11:
షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకాండకు తెగబడింది పోక్సో కేసులో రెండు నెలల్లో బెయిల్పై విడుదలైన నిందితుడుగా గుర్తించారు. మే 16వ తేదీన పోక్సో కేసులో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 26వ తేదీన రిమాండుకు తరలించారు. నిందితుడు రాజ్ కుమార్ కేవలం రూ.20,000 పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ రావడంతో, బయటికి వచ్చి ఆరుగురిని కిరాతకంగా హతమార్చాడు. బెయిల్పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో నిందితుడు ఉన్మాదిగా మారాడు. కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా హతమార్చాడు. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు సమాచారం.ఈ విషయం తెలిసి రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.