janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 9:42 am Digital Edition : JANAM VOICE

పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు.

పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు.

జనం వాయిస్, హన్మకొండ:

చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు పసుపుకు బదులుగా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఆదివారం వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్య దర్శి చక్రపాణితో కలిసి ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన రంగులు కలిపిన మాంసం తింటే ఉదర, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.