ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన. జనం వాయిస్, ఆదిలాబాద్:ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌కు అన్ని రకాల వసతులతో కూడిన ఎయిర్‌పోర్టు ఉండాల్సిందేనని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు వస్తే ఆదిలాబాద్‌కు పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.ఎర్రబస్సే కాదని.. ఆదిలాబాద్‌కు ఎయిర్‌ బస్సు కూడా తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఆదిలాబాద్‌‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు....