janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 7:56 pm Digital Edition : GATTU MAHESH

సోషల్ మీడియాలో హైలైట్ అయిన అల్లు స్నేహ రెడ్డి.

సోషల్ మీడియాలో హైలైట్ అయిన అల్లు స్నేహ రెడ్డి.

– స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్న బన్నీ భార్య..!

జనం వాయిస్, సినిమా:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రంగానికి నేరుగా సంబంధం లేకపోయినా ఆమెకు ఉన్న ఆదరణ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదని మరోసారి నిరూపితమైంది. స్నేహ రెడ్డి షేర్ చేసే ప్రతి ఫోటో క్షణాల్లోనే వైరల్ అవుతుండటం అభిమానులకు తెలిసిందే. తాజాగా ఆమె పంచుకున్న చిత్రాల్లో బేబీ పింక్ షేడ్ లాంగ్ డ్రస్‌లో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించారు. సింపుల్ మేకప్, నేచురల్ హెయిర్ స్టైల్‌తో ఆమె చూపించిన క్లాస్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఓవర్ స్టైలింగ్ లేకుండా సాదాసీదాగా ఉన్నా, ఆ లుక్‌లోనే ప్రత్యేకమైన గ్రేస్ కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డ్రస్‌కు తగ్గట్టుగా క్యారీ చేసిన మినిమల్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఆమె స్టైల్‌ను మరింత హైలైట్ చేసింది.
ఫోటోలు పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. అభిమానులు గార్జియస్, ఎవర్ గ్రీన్ బ్యూటీ, హీరోయిన్‌లా ఉన్నారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు సూపర్ వదినమ్మ అంటూ కామెంట్లతో సందడి చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమె లుక్‌ను మెచ్చుకుంటూ స్పందించారు. పోలిటికల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అల్లు అర్జున్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత స్నేహ రెడ్డి పాపులారిటీ మరింత పెరిగింది.