మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల యత్నం?

మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల యత్నం?గజ్వేల్–సిరిసిల్లలో భారీ పట్టివేతలు.బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లలో మద్యం, నిత్యావసరాలు సీజ్.జనం వాయిస్, తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నిల్వ ఉంచినట్లు అనుమానిస్తున్న మద్యం, నిత్యావసర సరుకులను ఎన్నికల అధికారులు భారీగా సీజ్ చేశారు. ఈ పట్టివేతలు కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, అలాగే కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల లో జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను ఆకర్షించేందుకు ముందుగానే సరుకులు నిల్వ ఉంచినట్లు అధికారులు భావిస్తున్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రెండో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గోలి మమత నివాసంలో...