యాంకర్ శివజ్యోతికి టీటీడీ కఠిన చర్యలు.
యాంకర్ శివజ్యోతికి టీటీడీ కఠిన చర్యలు. - ప్రసాద వ్యాఖ్యల దుమారం.జనం వాయిస్,తిరుమల,నవంబర్ 27: ప్రముఖ యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆమెపై కఠినంగా స్పందించినట్టు సమాచారం. భవిష్యత్‌లో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వినియోగించే ఆధార్ ఆధారిత నమోదు ప్రక్రియలో ఆమె వివరాలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది.తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో ఉండగా అన్నప్రసాదం పొందుతున్న సమయంలో శివజ్యోతి చేసిన...