janamvoice.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 6:11 pm Digital Edition : GATTU MAHESH

అందె శ్రీ సంస్మరణ సభ విజయవంతం చేయండి

అందె శ్రీ సంస్మరణ సభ విజయవంతం చేయండి

జనం వాయిస్,మంథని, నవంబర్ 18:

తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ సంస్మరణ సభ విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘోత్తం రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 22న అంబేద్కర్ చౌరస్తాలో సహజ కవి అందెశ్రీ సంస్మరణ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసిం, పలువురు ప్రముఖులు పాల్గొంటారని ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులర్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.