తెలంగాణ భావజాలానికి శబ్దాన్నిచ్చిన మహాకవి అందేశ్రీ కన్నుమూత.
తెలంగాణ భావజాలానికి శబ్దాన్నిచ్చిన మహాకవి కన్నుమూత.- అందెశ్రీ మౌనంతో తెలంగాణ సాహిత్యానికి తిరుగులేని లోటు- తెలంగాణ ఆత్మగీతం మౌనం చెందింది!- ఒక గీతం… ఒక ఉద్యమం… ఒక యుగం ముగిసింది.జనం వాయిస్,హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, తెలంగాణ సాహిత్యానికి స్పూర్తిగా నిలిచిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఆకస్మిక మరణం తెలుగు భాషా ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిన ఆయన, వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 7:25 గంటలకు ప్రాణాలు విడిచారు....