గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు.
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు.-రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 70 క్యాంటీన్ల ప్రారంభం.-జనవరి 13–15 మధ్య ప్రారంభానికి ప్రణాళిక.-పూటకు రూ.5కే మూడు పూటల భోజనం.జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 24: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న క్యాంటీన్ల నిర్మాణ పనులను జనవరి 10లోగా పూర్తి చేసి, జనవరి 13 నుంచి 15...