janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 12:32 pm Digital Edition : JANAM VOICE

మద్యం మత్తులో బస్సు ఎత్తికెళ్ళిన మరో మందుబాబు.!

మద్యం మత్తులో బస్సు ఎత్తికెళ్ళిన మరో మందుబాబు.!

జనం వాయిస్, జనగామ, జులై 10:

మద్యం మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. సూర్యాపేట వైపు  దాదాపు 21 కిలో మీటర్లు నడుపుకుం టూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తికి చెందిన వెంకన్న గురువారం రాత్రి జనగామ బస్టాండ్‌లో పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సును తీసుకుని సూర్యాపేట వైపు దాదాపు 21కిలో మీటర్లు వెళ్లాడు. సింగరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపానికి చేరుకున్న తర్వాత బస్సు అదుపుతప్ప డంతో రోడ్డుపక్కన ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది.
గమనించినఅక్కడ ఉన్నవారు అతన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో టోల్ గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సమాచారం అందు కున్న పోలీసులు ఘట నాస్థలికి చేరుకుని వెంకన్నను విచారిం చారు. డిపో నుంచి బస్సును ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిచంగా.. ఊరికే ట్రయల్ వేద్దామని బస్సు నడిపానని మందు బాబు సమాధానమిచ్చాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు