janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 5:35 pm Digital Edition : GATTU MAHESH

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు.

– ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు.
– సీఐడీ ఫైనల్ రిపోర్ట్, కోర్టు ఉత్తర్వులు కోరుతూ వినతి.
– జనవరి 19న విచారణకు నిర్ణయం.

జనం వాయిస్, విజయవాడ:

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడుతో సహా 37 మంది నిందితులపై కేసును ముగించిన నేపథ్యంలో, ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
సీఐడీ పోలీసులు ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్ ప్రతులు, కేసు ముగింపుపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తనకు అందజేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు 54 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడు సెక్షన్ 164 ప్రకారం స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత కేసు ఏ విధంగా ముగిసిందన్న అంశంపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో వాదించారు. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ తరఫున మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ హాజరుకానున్నారు.
ఈ పిటిషన్‌ను జనవరి 19న విచారించనున్నట్లు ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే రోజున పిటిషనర్ తరఫున వాదనలు వినిపిస్తామని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఒకవేళ ఏసీబీ న్యాయస్థానం నుంచి అనుకూల ఉత్తర్వులు రాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ న్యాయవాది వెల్లడించారు.